...

హిందూ సమ్మేళనం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

హిందూ సమ్మేళనం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

హైదరాబాద్, మే 21, ( అద్దం న్యూస్ ) :    హిందూ స‌మ్మేళ‌న నిర్వాహ‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని ఆంధ్రాకేఫ్ చౌర‌స్తా ద్ద ఈ నెల 23వ తేదీన హిందూ సమ్మేళనం జ‌రుగ‌నుంది. ఈ స‌మ్మేళ‌నానికి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం గురువారం గాంధీన‌గ‌ర్‌లోని శ్రీ ముత్యాల‌మ్మ ఆల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజ‌రై పోస్ట‌ర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… హిందువుల్లో ఐక్య‌త‌ను చాటి చెప్పేందుకు ఈ స‌మ్మేళ‌నాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. హిందూ స‌మ్మేళ‌నానికి హిందూ బంధువులు, యువ‌కులు, హిందూ సంఘాల నాయ‌కులు, దేవాల‌యాల క‌మిటీ స‌భ్యులు, మ‌హిళ‌లు అధిక సంఖ్య‌లో పాల్గొని హిందూ ఐక్య‌త‌ను చాటి చెప్పాల‌న్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణ, డాక్ట‌ర్‌.చంద్రశేఖర్, బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌దర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, నాయ‌కులు సోమిషెట్టి శ్రీనివాస్, రాధాకృష్ణ, సత్యనారాయణ, శకుంతల, శశికళ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.