హెచ్ఎంఎటి ఆధ్వర్యంలో ఘనంగా హోమియో ఫెస్ట్–2026
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : హోమియో వైద్య పితామహుడు డాక్టర్.శామ్యూల్ హనిమన్ 271వ జయంతిని పురస్కరించుకొని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( హెచ్ఎంఎటి ) హైదరాబాద్ వారు నిర్వహించిన ఒక్క రోజు హోమియో ఫెస్ట్ 2కె26 కార్యక్రమం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ హోమియో ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం హాజరై డాక్టర్.హానిమన్, డాక్టర్.ఎన్.రామయ్య చిత్ర పటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. హోమియో వైద్య విద్యార్థుల్లో క్లినికల్ సామర్ధ్యాలతో పాటు, సృజనాత్మక శక్తిని, పోటీ తత్వాన్ని అలవాటు చెయ్యడమే ఈ హోమియో ఫెస్ట్ ఉద్దేశం అని హెచ్ఎంఎటి అధ్యక్షుడు డాక్టర్.కె.గోపాలకృష్ణ స్వాగతోపన్యాసం చేసారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్.జి.దుర్గాప్రసాద్ రావు, హెచ్ఎంఎటి వైద్యసేవలు, ఇతర కార్యక్రమాలను వివరించారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ ఆయుష్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్.పెరుగు శ్రీకాంత్ బాబు, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బి.భాస్కర్ రావు, గౌరవ అతిథులు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.లింగరాజు ఆయుష్ (హోమియో ) అదనపు సంచాలకులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి చేతుల మీదుగా హోమియోఫెస్ట్ 2K26 ప్రారంభించారు.
అనంతరం కిమ్స్–హెచ్ఎంఎటి సహకారంతో నిర్వహించే కోర్స్ ‘ క్లినికల్ అబ్జర్వర్షిప్ కార్యక్రమం ’ స్కిల్ టైరో విభాగం ద్వారా డాక్టర్.భాస్కర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రముఖ హోమియో వైద్యుడు, పూర్వ హోమియో అదనపు సంచాలకులు డాక్టర్.జి.జనార్ధన్ రెడ్డి, హెచ్ఎంఎటి–హోమియోపతి అకడెమిక్ ఫోరమ్ పై ప్రత్యేక ప్రసంగం చేయగా , అనంతరం కర్ణాటక నుండి వచ్చిన ప్రముఖ వెటరినరీ వైద్యుడు డాక్టర్.పికె.నిజలింగప్ప వెటరినరీ హోమియోపతి పై డాక్టర్.ఎన్ రామయ్య స్మారక ఉపన్యాసం చేసారు. డాక్టర్.గోహల్ షేక్, ఎండి ( హోమియో) యువ వైద్యుల కెరీర్ పై ప్రసంగించారు. ఈ హోమియో ఫెస్ట్‌లో సైంటిఫిక్ సెషన్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, స్లోగన్ కాంటెస్టులు, మేమే, రీల్స్, లైవ్ మెటీరియా మెడికా, క్విజ్ అంశాలల్లో పోటీలకు తెలంగాణలోని అన్ని హోమియో వైద్య కళాశాలల వైద్య విద్యార్థులు పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. అదే విధంగా హెచ్ఎంఎటి తరపున ప్రతి హోమియో వైద్య కళాశాల నుండి బిహెచ్ఎంఎస్ ఎండి ( హోమియో ) టాపర్ లకు డాక్టర్.హనీమన్ అవార్డులు అందజేసారు. ముగింపు కార్యక్రమానికి పూర్వ కేంద్ర మంత్రి డాక్టర్.సముద్రాల వేణుగోపాల చారి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఆయా హోమియో వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రత్యేక అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎటి ఉపాధ్యక్షులు డాక్టర్.ఆనందరావు మెన్గ్జి, డాక్టర్.మధు వారణాశి, డాక్టర్.మాణిక్ ప్రభు, కోశాధికారి డాక్టర్.వేణుగోపాల్ గౌరి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డాక్టర్.ఆర్.గౌతమ్ , డాక్టర్.చాముండేశ్వరి, డాక్టర్.ఎన్.రామయ్య, స్పాన్సర్ డాక్టర్.ఎన్ఎస్.రఘురాం, డాక్టర్.లక్ష్మయ్య, డాక్టర్.కల్పన కృష్ణ, డాక్టర్.ఆర్.సాయి శృతి, డాక్టర్.హర్షిత, డాక్టర్.చాముండేశ్వరి, డాక్టర్.శార్వాణి, డాక్టర్.శ్రీనిధి, కిమ్స్ స్కిల్ టైరో మెంబర్స్ రశిక, ఏకే స్వరూప్ ల తో పాటు ఇతర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ, హోమియో ప్రాక్టీషనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.














Leave a Reply