Friday, September 18, 2026
HomeHyderabadకాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపులు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం...

కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపులు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

 

కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపులు

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ :    ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలg నిర్వహించకుండానే కేవలం స్థానిక కాంగ్రెస్ నాయకుల సిఫారసు మేరకు ఇళ్ల కేటాయింపు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం ఇదేనని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చెబుతున్న విషయానికి, వాస్తవ పరిస్థితి మరోలా ఉందని అన్నారు. నిజాయితీగా పేద వాళ్ళయినా అర్హులందరికీ ఇందిరమ్మ కేటాయించాలని., ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అర్హులైన నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందడం లేదన్నారు. ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ల లాగా కట్టుకోవడానికి అవకాశం వచ్చినప్పటికీ మావద్ద డబ్బులు లేవని చేతులెత్తేసిందని విమ‌ర్శించారు. ప్రభుత్వం ప్రచారాలతో కడుపు నింపుకోవాలని ఆలోచనలో ఉందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేస్తున్నారని, లబ్ధిదారులుగా కాంగ్రెస్ వారిని గుర్తించడం చాలా అమానుషమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఈ విధంగానే పక్షపాత ధోర‌ణి వ్యవహరించిందో నిజమైన అర్హులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిందో అదే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ అదే పంథాను అవలంభిస్తుండ‌టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు సాయిబాబా తెలిపారు. అదే విధగా జిహెచ్ఎంసి కమిషనర్ 80 శాతం వరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశామని ప్రచార ఆర్భాటం చేస్తున్నారని.. 5 శాతం రాయితీ ఇచ్చి ముందుగానే వసూలు చేసుకుంటున్నారని అన్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాని, ప్రజా ఆరోగ్య విషయంలో కానీ జిహెచ్ఎంసి ఏమాత్రం పట్టించుకోవడం లేద‌ని విమ‌ర్శించారు.

నగరంలో సమస్యల పట్ల జిహెచ్ఎంసి స్పందించక పారిశుద్ధ్యం లోపించి దోమలు, ప్రజారోగ్యం కొరవడి డెంగ్యూ, మలేరియా వంటి అంటు వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. కనీసం పాగింగ్ కూడా చేయడం లేదన్నారు. కేవలం అధికారుల జీతభత్యాల కోసమే జిహెచ్ఎంసి ఉందా అని సాయిబాబా ప్రశ్నంచారు. ప్రజల నుండి ముక్కు పెండి వసూలు చేసి పూర్తిగా తమ జీతభత్యాలకు, విలాసాలకే ఖర్చు చేయడం చాలా విచారకరమైన విషయమ‌న్నారు జిహెచ్ఎంసిలో ప్రతిపక్ష కార్పొరేటర్లు ఎంతో మంది ఉన్నా ఈ విషయంలో ఎవరూ ప్రశ్నించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి ఫాగింగ్, దోమల విషయంలో ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను నిలదీయాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో జిహెచ్ఎంసి ముందు ఉండాలని అన్నారు. ఈ స‌మావేశంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజు గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page