కార్పొరేటర్ పావని సూచనల మేరకు మ్యాన్‌హోల్ మరమ్మతు పనులు పూర్తి
హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్‌టి 198 సమీపంలో మ్యాన్‌హోల్ పూర్తిగా దెబ్బతిని సివరేజీ సమస్య రావడంతో స్థానికులు కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కార్పొరేటర్ పావని వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్‌తో మాట్లాడి దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్ సోమవారం మ్యాన్‌హోల్ మరమ్మతు పనులు చేపట్టారు. కార్పొరేటర్ పావని సూచనల మేరకు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ శంకర్, బిజెపి నాయకులు ఉమేష్, ప్రశాంత్, స్థానికులతో కలిసి పనులను పర్యవేక్షించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply