శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీవాసులకు వెంటనే ఇళ్లు కేటాయించాలి
– కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
హైదరాబాద్, మే 9, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీవాసుల ఇళ్లను రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేసి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంత వరకు బాధితులకు ఇళ్లను కేటాయించలేదని, వెంటనే బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కోరారు. 19 మంది నిరుపేద దళిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరుతూ శుక్రవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బస్తీవాసులతో కలిసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. గాంధీనగర్ డివిజన్ శ్రీ స్వామి వివేకానందనగర్ బస్తీవాసుల ఇళ్లను రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేయడం వల్ల 19 బాధితులు తమ ఇళ్లను కోల్పోయారన్నారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్‌ను, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అనుదీప్ ఇళ్ల కేటాయింపు కై సూచనలు అందాయని, త్వరలోనే శ్రీ స్వామి వివేకానంద నగర్ బస్తీవాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారని వినయ్ కుమార్ తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బస్తీవాసులు ఎంబి.కృష్ణ, జ్ఞానేశ్వర్, ఆనంద్ రావు తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply