అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
– రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, జూన్ 24, ( అద్దం న్యూస్ ) : అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం తెలంగాణ గుడిసె వాసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాకి రవి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపా ర్కువద్ద ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ… ఘట్కేసర్ మండలం కచవేనిసింగారంలో 1500 మందికి, మోయినాబాద్ మండలం, హిమాయత్ సాగరులో 280 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారన్నారు. కోర్టు కేసులు ఉండడంతో పొజిషన్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ అయ్యాయని, ఇప్పుడు పొజిషన్ ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేసారు.
హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన చెందిన పేద ప్రజలు ఇంటి అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమై జీవిస్తుంటే ప్రజాపాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అమ్ముకుంటూ రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఇళ్ల పట్టాలు వస్తాయని ఆశించి ఇందిరమ్మ రాజ్యం కావాలని రాష్ట్రంలోని పేద ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటేసి అధికారం తీసుకొస్తే ఈరోజు అదే రాష్ట్రాన్ని దగా చేస్తూ నాయకులు పొట్టలు నిప్పుతూ పేద ప్రజల కడుపు కొడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పేదలు గుడిసెలు వేసుకున్న స్థలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న పూలు, కూరగాయల మార్కెట్ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఆందోళనకు దిగుతామని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో అనంతయ్య, బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోధీరాందేవ్ యాదవ్, తెలంగాణ గుడిసెవాసుల సంఘం నాయకులు చరణ్ యాదవ్, కె.శ్రీను, ములుగు నవీన్, శివ కుమార్ యాదవ్, బాకీ సోమయ్య, సందీప్, కుమ్మరి విఠల్, వెంకన్న, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply