
నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా
సికింద్రాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించారు. నాలాను ఆనుకొని ఉన్న రెండు భవనాలను కూల్చివేశారు. గురువారం కంటోన్మెంట్ సీఈవో మధుకర్ నాయక్‌తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాను ఆక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీంతో శుక్రవారం ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోవడంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలు, ఇండ్లలోకి నీరు ప్రవేశిస్తున్నదని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేపడ్డారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply