బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఐకాన్ అవార్డుల ప్ర‌దానం

 

బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో

ఐకాన్ అవార్డుల ప్ర‌దానం

కూచిపూడి నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న క‌ళాకారులు

                                                         కూచిపూడి నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న క‌ళాకారులు

సిటీ క‌ల్చ‌ర‌ల్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :   బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలందించిన వారికి ఐకాన్ అవార్డుల ప్ర‌దానోత్స‌వ‌ కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జ్ బురుగుల మధు సూదన్ ( మల్కాజిగిరి) పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎస్‌బిఐ అధికారి చౌహాన్ రవీంద్ర సింగ్, సంఘ సేవకుడు వీర భోగ వసంత రాయలు, కూచిపూడి నాట్య గురువులు దేవర కొండ శ్రీనివాసరావు, కాంచన సుధారమ్య, అనురాధ, జానపద గాయకురాలు జి.భాగ్యలక్ష్మీ, గోసేవకుడు గోపికార్ పునిత్, జి.శ్రీవల్లి, సంస్థ అధ్యక్షుడు విక్కి మాస్టర్ పాల్గొన్నారు. ఈ సభకు వ్యాఖ్యాతగా మధుర వాచస్పతి రమణాచారి వ్యవహరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page