పిల్లలు ఆపదలో ఉంటే 100 కు డయల్ చేయాలి
– సెంట్రల్ జోన్ మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ చందన
హైదరాబాద్, డిసెంబర్ 26, అద్దం న్యూస్ : పిల్లలు ఆపదలో ఉంటే 100 కు డయల్ చేయాలని సెంట్రల్ జోన్ మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ చందన అన్నారు. అప్స స్వచ్చంద సంస్థ, ఇంద్ర ధనస్సు బాలల సంఘం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో బాల సమస్యలపై బాల వాణి చర్చ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్లో జరిగింది. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పై జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ చందన, దోమలగూడ పిఎస్ ఎస్ఐ ప్రసన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అప్స లాంటి స్వచ్ఛంద సంస్థలు బస్తీలలో పిల్లలు తమరు ఎదుర్కొంటున్న సమస్య గుర్తించి అధికారులతో చర్చ చేయడం అధికారులతో మాట్లాడడం, పిల్లలలో ఇంత చైతన్యం చేయడం వివిధ సమాజిక విషయాలపై అవగాహన చేయడం అభినందనీయమన్నారు. రాత్రివేళలో బస్తీల్లో గస్తీ చేపిస్తా అన్నారు. అనంతరం వాటర్ వర్క్స్ అసిస్టెంట్ ఇంజనీర్ సుప్రజ మాట్లాడుతూ… ఇంద్ర ధనస్సు బాలల సంఘం ఫిర్యాదు మేరకు మంచినీటి సరఫరాలో సమయాన్ని త్వరలోనే పూర్తి చేస్తా అని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు జి.వెంకటేష్ మాట్లాడుతూ… అప్స స్వచ్ఛంద సంస్థ పిల్లల్లో చైతన్యం చేయడం సంతోషమన్నారు. సర్వ్ నీడీ వ్యవస్థాపకుడు డాక్టర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ… మా సంస్థ ద్వారా ప్రతి రోజు 2 వేల మందికి ఉచితంగా పేదలకు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్స ప్రతినిధులు బొట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply