హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ : వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో కోడెలు మృత్యువాత పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ లు పట్టించుకోరా అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో కోడె ముక్కు చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని కోడెల రాజన్న స్వామికి సమర్పించడం ఆనవాయితి అని, ఈ కోడెలతో కోట్లాది రూపాయలు ఆలయానికి ఆదాయం వస్తున్నా, కొడెల సంరక్షణ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వారం రోజుల వ్యవధిలో దాదాపు పదిహేనుకు పైగా కోడెలు మృత్యువాత పడినా ఆలయ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పూడ్చ పెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గాని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గానీ స్పందించకపోవడం విచారకరమన్నారు. కోడెల సంరక్షణ కొరకు స్థల సేకరణ గురించి పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎందుకు చనిపోతున్నాయో కనీసం అధికారులు పర్యవేక్షించడంలేదన్నారు. కోడెల సంరక్షణ కొరకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేసారు. కామారెడ్డిలో ఎన్నికల ముందు అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుని అమలు కానీ హామీలు నోటి కొచ్చిన వాగ్దానాలు ఇచ్చారని… స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం ఇస్తామని, తప్పుల తడకగా కులగణన నిర్వహించి, కేంద్రం కులగలన చేస్తామంటూ ప్రకటిస్తే మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారన్నారు. మీరు చేసింది అసెంబ్లీలో తీర్మానం చేయడం తప్ప ఏమీలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సాయిబాబా డిమాండ్ చేసారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ సర్పంచుల బకాయి బిల్లుల చెల్లిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి మాజీ సర్పంచ్‌లు రోడ్డు పైకెక్కి ధర్నా చేస్తున్నా వారిని పట్టించుకునే నాథుడే లేడన్నారు. గొర్లు తినే బిఆర్ఎస్ పాలన పోయి బర్లు తినే కాంగ్రెస్ పాలన వచ్చినట్టు దయనీయంగా మాజీ సర్పంచ్‌ల పరిస్థితి తయారైందని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తెర మీదికి రాగానే రైతు బంధు అంటూ రాజీవ్ యువశక్తి పథకమంటూ, రైతుకు అకౌంటులో డబ్బులు చెల్లిస్తామంటూ కాలయాపన చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందడానికి మాయమాటలు చెప్తూ ఎన్నో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. గ్రామాభివృద్ధి కొరకు మాజీ సర్పంచ్‌లు చేసిన బిల్లుల బకాయిలు అధికారంలోకి రాగానే తాము చెల్లిస్తామని సర్పంచ్‌లను ఆదుకోకుండా కాలయాపన చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల డిమాండ్లను నెరవేర్చి పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. గ్రామ స్వరాజ్యమే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని చెప్పిన గాంధీ వారసులుగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు కనీసం సర్పంచ్‌ల బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని, బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయకుడు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply