మహిళలకు స్వయం ఉపాధి కలిగించే ఉచిత శిక్షణ కేంద్రాలకు మా పూర్తి సహకారాన్ని అందిస్తాం – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 19, అద్దం న్యూస్ :     మహిళలకు స్వయం ఉపాధి కలిగించే ఉచిత శిక్షణ కేంద్రాలకు మా పూర్తి సహకారాన్ని అందిస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ వివి గిరిన‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో ల‌య‌న్స్ క్ల‌బ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యార‌డైజ్‌, నివి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న మ‌హిళ‌ల ఉచిత బ్యూటీష‌న్ శిక్ష‌ణ కేంద్రాన్ని గురువారం కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ సంద‌ర్శించారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న మొద‌టి బ్యాచ్ మ‌హిళ‌ల‌తో, శిక్ష‌ణనిచ్చే టీచ‌ర్ ప్ర‌వీణ‌తో కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడారు. శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఎలా ఉన్నాయి.. ఎంత వ‌ర‌కు ప్రావీణ్యం పొందారు.. శిక్ష‌ణ స‌మ‌యంలో ల‌భించిన స‌దుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ…శిక్ష‌ణ పూర్తి చేసుకున్న మ‌హిళ‌లు త్వ‌ర‌లో స్వ‌యం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి పొందాల‌ని, వారికి బ్యూటీష‌న్‌గా మంచి ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు. త్వ‌ర‌లో మ‌రో బ్యాచ్ ప్రారంభం అవుతుంద‌ని, ఈ ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌ను స‌ద‌వ‌కాశంగా భావించి డివిజ‌న్‌లోని మ‌హిళ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కార్పొరేట‌ర్ పావ‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page