Saturday, September 19, 2026
No menu items!
HomeEducationఫీజు రియంబ‌ర్స్‌మెంట్ అమలు చేయక‌పోతే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన

ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ అమలు చేయక‌పోతే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన

📰 Generate e-Paper Clip

ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ అమలు చేయక‌పోతే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన
» జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేంద‌ర్ ప‌టేల్ గౌడ్

కాచిగూడ‌,  జూలై 3, ( అద్దం న్యూస్ ) :   ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ అమలు చేయ‌క‌పోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేంద‌ర్ ప‌టేల్ గౌడ్ హెచ్చరించారు. ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ అమలుచేయాలని, ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలనే డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ మహాసభ ఆధ్వర్యంలో శుక్రవారం చాధరాఘాట్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజేంద‌ర్ ప‌టేల్ గౌడ్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ప్రభుత్వం అని ద్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్య వ్యవ‌స్థ ఆస్తవ్యస్తంగా తయారైందని విమ‌ర్శించారు. సీఎం అనాలోచిత దోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆరోపించారు. ప్యూచర్ ఉన్న విద్యార్థులను పక్కనబెట్టి, ప్యూచర్ లేని సీటి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పాకులాడుతున్నాడని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఫీజుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూషన్ భాస్కర్, డాక్టర్ ప్రశాంత్ నిమ్‌క‌ర్‌, కృష్ణ, ముత్యాల్‌రావు, సత్యపాల్‌సింగ్‌, ప్రదీప్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page