హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : స్టాలిన్ కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్‌మెట్ డివిజన్ నాగమయ్యకుంట బస్తీలో రూ.44 లక్షలతో నిర్మించనున్న సివరేజి పైప్‌లైన్ పనులకు, గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో 10 లక్షల నిధులతో మంచినీటి పైప్‌లైన్ పనులు, రూ.20 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు, ముషీరాబాద్ బాపూజీనగర్ స్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులకు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారిలతో కలిసి కిషన్‌రెడ్డి శనివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… డీలిమిటేషన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ అని అన్నారు. దక్షిణ భారతదేశానికి ఎక్కడ అన్యాయం జరగదన్నారు. దక్షిణ భారత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోందని తెలిపారు. డీలిమిటేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు.













Leave a Reply