Friday, September 18, 2026
HomeTelanganaస్టాలిన్ కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు – కేంద్ర మంత్రి జీ.కిషన్...

స్టాలిన్ కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు – కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : స్టాలిన్ కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్‌మెట్‌ డివిజన్ నాగమయ్యకుంట బస్తీలో రూ.44 లక్షలతో నిర్మించనున్న సివరేజి పైప్‌లైన్ పనులకు, గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో 10 లక్షల నిధులతో మంచినీటి పైప్‌లైన్ పనులు, రూ.20 లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు, ముషీరాబాద్ బాపూజీన‌గ‌ర్ స్మ‌శాన వాటిక‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, రాంన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ర‌విచారిల‌తో కలిసి కిష‌న్‌రెడ్డి శ‌నివారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… డీలిమిటేషన్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ అని అన్నారు. దక్షిణ భారతదేశానికి ఎక్కడ అన్యాయం జరగదన్నారు. దక్షిణ భారత అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోందని తెలిపారు. డీలిమిటేషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు.Union Minister G. Kishan Reddyఈ కార్య‌క్ర‌మంలో ముషీరాబాద్ త‌హ‌శిల్థార్ రాణా ప్ర‌తాప్ సింగ్‌, ఏఎస్ఓ దీప్తి, వాట‌ర్ వ‌ర్క్స్ చిల‌క‌ల‌గూడ‌, దోమ‌ల‌గూడ డిజిఎంలు మోహ‌న్‌రాజ్‌, కార్తీక్‌రెడ్డి, మేనేజ‌ర్లు శివ‌, కృష్ణ‌మోహ‌న్‌, జిహెచ్ఎంసి డిఈ లు స‌న్ని, గీత‌, ఏఈ విశేష్‌నాయ‌క్‌, వినోద్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా, బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్‌గౌడ్‌, సీనియ‌ర్ నాయ‌కుడు మేక‌ల సారంగ‌పాణి, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి అడిక్‌మెట్‌, ముషీరాబాద్‌, గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ల అధ్య‌క్షులు సాయికృష్ణ యాద‌వ్‌, కంచికుమార్ ముదిరాజ్‌, న‌వీన్‌కుమార్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ప్ర‌భాక‌ర్‌, రాకేష్‌, బొట్టు శ్రీనివాస్‌, ముఠా న‌రేష్‌, హ‌రీష్‌, సాయిలు, మేడి స‌త్య‌నారాయ‌ణ‌, బిజెపి నాయ‌కులు ఆనంద్‌రావు, శ్రీకాంత్, దామోదర్, రాజు, ఎం.ఉమేష్, ఎండి.మహమూద్, సత్తి రెడ్డి, విన్ను ముదిరాజ్‌, న‌రేష్‌, శేష‌సాయి, కిషోర్‌, వంశీ, బ‌ద్రి నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page