దేవాల‌యాల అభివృద్ధికి ఆల‌యాల క‌మిటీ స‌భ్యులు కృషి చేయండి – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ : దేవాల‌యాల అభివృద్ధి కోసం ఆల‌యాల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ స‌భ్యులు కృషి చేయాల‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ రాంన‌గ‌ర్ రామాల‌యం నూత‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకారం శ‌నివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో ల‌క్ష్మారెడ్డి నూత‌న పాల‌క‌మండ‌లి స‌భ్యుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఆల‌య క‌మిటీ ఛైర్మ‌న్‌గా వి.ఆనంద్ ముదిరాజ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఆయ‌న‌తో పాటు ధ‌ర్మ‌క‌ర్త‌లుగా వి.గోవ‌ర్థ‌న్‌రెడ్డి, జి.మీనా, బి.రాంచంద‌ర్‌, జె.యాద‌గిరి, ఎన్‌.ప్ర‌శాంత్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… నియోజ‌క‌వ‌ర్గంలోని దేవాదాయ శాఖ ఆల‌యాల్లో పాల‌క‌మండ‌లి క‌మిటీ స‌భ్యులంద‌రూ ఆయా ఆల‌యాల్లో జ‌రిగే పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌న్నారు. ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బందులురాకుండా చూసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య‌ ఎక్స్ అఫిషియో మెంబ‌ర్ ఆరుట్ల వెంక‌ట‌ర‌మ‌ణాచార్యులు, మాజీ కార్పొరేట‌ర్ ఆర్.క‌ల్ప‌నా యాద‌వ్‌, యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ యాద‌వ్‌, ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వ‌ర‌ద‌రాజు, వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page