...

ఆక‌ట్టుకున్న నెల నెలా క‌ళా వెన్నెల సాంస్కృతిక కార్య‌క్ర‌మం

 

సిటీ క‌ల్చ‌ర‌ల్, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్‌ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “నెల నెలా కళా వెన్నెల” సాంస్కృతిక కార్యక్రమాలు ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆపాత మధురాలు – సంగీత విభావరి, కూచిపూడి నృత్య ప్రదర్శన, కథక్ నృత్యం, ఆడెనే శివుడి తాండవం,పేరిణి నృత్యం లాంటి అనేక సంకృతిక కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు డాక్ట‌ర్‌.అంజిబాబు, వైఆర్.రెడ్డి, పద్మావతి, శివ నాయుడు, నాగలక్ష్మి, సూర్యనారాయణ, ఎంవివి.సూర్య నారాయణ, ఉమా, రామలక్ష్మి, హ్యన్మంత్ రావు పాల్గొన్నారు.నెల నెలా క‌ళా వెన్నెల సాంస్కృతిక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విన‌య్ కుమార్‌

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.