Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADనేడు ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం

నేడు ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం

📰 Generate e-Paper Clip

నేడు ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనం ప్రారంభోత్సవం
– డాక్టర్ దండేపు బసవానందం వెల్లడి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 30, ( అద్దం న్యూస్ ) :   హోమియోపతి వైద్య రంగంలో రాష్ట్రంలో పేర్కొందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దండేపు బసవానందం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈశ్వరప్ప హోమియోపతి హాస్పటల్ నూతన భవనాన్ని హైద‌రాబాద్‌ నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభ వీధిలో ఈ నెల 31వ తేదీ ( నేడు ) సోమవారం ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ బసవానందం తెలిపారు. ఆదివారం చిక్కడపల్లిలోని హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, విశిష్ట అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, ఎం.అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సిహెచ్ మదన్ రెడ్డి, బిఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జై సింహ, ప్రత్యేక ఆహ్వానితులుగా జేఎస్‌పిఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.లింగరాజు, ఐహెచ్‌పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.చంద్రశేఖర రావు, ఐహెచ్‌పి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టరు మధు వారణాసి, ఐహెచ్‌పి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంఎన్.రాజులు హాజరవుతున్నట్లు డాక్టర్ బసవ ఆనందం తెలిపారు. ఆయుర్వేద చికిత్సతో అన్ని రకాల రోగాలను తగ్గిస్తూ ప్రజలకు నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న తాను రోగులకు మెరుగైన వైద్య సేవలు, పెరిగిన వసతులు అందించేందుకు ఈ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page