డిసిపి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం
హైదరాబాద్, ఆగస్టు 15, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అంబర్‌పేట డిసిపి కార్యాలయంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్.బి.బాలస్వామి (ఐపిఎస్) హాజరై ఈస్ట్ జోన్ అదనపు డిసిపి జె.నర్సయ్యతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఏసిపి, సిఐలు, ఎస్ఐలతో పాటు పీస్ కమిటీ ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్, ఈస్ట్ జోన్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఎల్.శ్రీలత, మొహమ్మద్ ఉస్మాన్, మీర్ దస్తగీర్ అలీ, సుజాత్ అలీ ఖాన్, లక్ష్మణ్, మరి కొంత మంది ప్రముఖులు హాజరయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply