Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabad11 ఏళ్ల మోది సుపరిపాలనలో ప్రపంచంలో భారత్ అత్యున్నత స్థాయికి చేరుకుంది – బిజెపి...

11 ఏళ్ల మోది సుపరిపాలనలో ప్రపంచంలో భారత్ అత్యున్నత స్థాయికి చేరుకుంది – బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గుండ‌గోని భ‌ర‌త్‌గౌడ్‌

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 20, అద్దం న్యూస్ :   ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల సుపరిపాలనలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి భార‌త‌దేశం చేరుకుందని బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గుండ‌గోని భ‌ర‌త్‌గౌడ్ అన్నారు. 11 ఏళ్ల మోది పాలనపై భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ సంకల్ప సభ గాంధీనగర్ డివిజన్‌లోని అశోక్‌న‌గ‌ర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌లో జ‌రిగింది. శుక్ర‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా భరత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా భ‌ర‌త్‌గౌడ్ మాట్లాడుతూ… వికసిత భారత్ వైపుగా దేశం ఎలా పయనిస్తుందో, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలే నిదర్శనమ‌న్నారు. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గాంధీనగర్ డివిజన్ బీజేపీ నాయకులకు భరత్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎ.వినయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ జరగలేదని, పేదల సంక్షేమానికి ఎన్‌డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చేలా సంక్షేమ ఫలాలను అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్తోదన్నారు. నాయకులు, కార్యకర్తలు మోది కేంద్ర ప్రభుత్వ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, అభివృద్ధి పై అందరికీ అవగాహన కల్పించాల‌న్నారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో మేయర్ స్థానాన్ని తప్పక కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని అన్నారు. ఈ సభలో డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు రొయ్యూరు శేష సాయి, శ్రీకాంత్, విఎస్‌టి రాజు, దామోదర్, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, శివ కుమార్, శ్రీనివాస్, ఆకుల సురేందర్, సురేష్, కుమార్, ఆనంద్ రావు, విజయ లక్ష్మీ, సంయుక్త రాణి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page