Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadబ‌న్సిలాల్‌పేటలో కమ్యూనిటీ కనెక్ట్

బ‌న్సిలాల్‌పేటలో కమ్యూనిటీ కనెక్ట్

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్‌, జూన్ 19, అద్దం న్యూస్ :   సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గురువారం రాత్రి బ‌న్సిలాల్‌పేట‌లో కమ్యూనిటీ కనెక్ట్ జ‌రిగింది. గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని బ‌న్సీలాల్‌పేట్‌లోని సిసి న‌గ‌ర్ ఫేజ్ 1, 2, 3, 4 బ‌స్తీల్లో 250 మంది పోలీస్ సిబ్బందితో క‌లిసి క‌మ్యూనిటీ క‌నెక్ట్ కార్య‌క్ర‌మాన్ని డిసిపి నిర్వ‌హించారు. ఇందులో భాగంగా బ‌స్తీల్లోని ఇళ్ల‌ను త‌నిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 80 టూ విలర్స్, ఒక‌ ఫోర్ విల్లర్, ఒక‌ ఆటో.. 32 బీర్ బాటల్స్, 4 కోటర్స్ తోపాటు 150 ప్యాకెట్ల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది అనుమానితులను.. ముగ్గురు రౌడీ సీటర్స్ అదుపులోకి తీసుకోని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీసీపీ శిల్ప‌వ‌ల్లి తెలిపారు. ఇక నుండి ఎప్పటికప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసి అవ‌గాహ‌న చేస్తామ‌న్నారు. గంజాయితో పాటు డ్రగ్స్ పై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇలాంటి సర్చ్ ఆపరేషన్స్ వల్ల యువతలో మార్పు వస్తుందని బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిసిపి శిల్ప‌వ‌ల్లి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏసిపి యాద‌గిరి, గాంధీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ సిఐ బోస్ కిర‌ణ్‌, దోమ‌ల‌గూడ సిఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page