హైదరాబాద్, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసితో అమెరికా దేశానికి చెందిన ఇండియనా స్టేట్ తో 2010 సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆ చెందిన ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బుధవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ పరిధిని పెంచి గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అంతే కాకుండా హైదరాబాద్ చుట్టూ మరొక త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. ఉత్తరం వైపు నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజా పాలన రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసిలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణకు రూ. 7032 కోట్లతో రోడ్డు వెడల్పు, ఫ్లై ఓవర్లు నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు ఇట్టి పనులు పూర్తయితే గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
నగరంలో పాఠశాల విద్యా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఇండియనా ప్రతినిధుల బృందం మేయర్ కోరగా వారు సానుకూలంగా స్పందించి అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని మేయర్ కు వివరించారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఇండియనా ప్రతి నిధులు మేయర్‌కు వివరించారు. హైదరాబాద్ గతంలో కంటే అభివృద్ధి చెందినట్లు ప్రతినిధి బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియానా పోలీస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డియాగో మోరల్స్, చింతా ల రాజు, చీఫ్ అడ్వైసర్ ఆఫ్ గ్రోత్ అండ్ స్ట్రాటజీ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply