Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadనిబంధనలకు విరుద్ధంగా వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలి

నిబంధనలకు విరుద్ధంగా వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలి

📰 Generate e-Paper Clip

 

నిబంధనలకు విరుద్ధంగా

వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలి

హైదరాబాద్, అద్దం న్యూస్ :    ఇంట‌ర్మీడియ‌ట్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వేసవికాలంలో నడుస్తున్న ఇంటర్ కళాశాలలను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శికె.అశోక్‌రెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా ప్రైవేట్ కార్పొరేట్‌ కళాశాలలో క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు జూన్ ఒకటో తారీకు వరకు సెలవులు ప్రకటించినా… వేసవి కాలంలో క్లాసులో నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకుంటామని సర్కులర్ ఇచ్చినా కూడా కార్పొరేట్ ప్రైవేటు కళాశాలలో నిబంధనలను పట్టించుకోకుండా విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్నాయ‌న్నారు. క్లాసులు నిర్వహిస్తున్నారని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులకు తెలియజేసిన బోర్డు అధికారులు ఆ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం శోచ‌నీయ‌మ‌న్నారు. ఆ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు డబ్బులకు లొంగి కళాశాలల పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా విద్యార్థులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్న ఇంటర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page