Saturday, September 19, 2026
No menu items!
HomeTelanganaతెలంగాణ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి

తెలంగాణ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని జాతీయ ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త, సో‌షల్ ఆక్టివిస్ట్ రచన ముద్రబోయిన అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ( టిపిఎస్ కె ) లో హిజ్రా, ట్రాన్స్ జెండర్ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రచన మాట్లాడుతూ… తెలంగాణ బడ్జెట్ లో మరి దారుణమైన వివక్ష చూపించారన్నారు. 4 లక్షల మంది హిజ్రా, ట్రాన్స్ జెండర్లు ఉంటే కేవలం 2 కోట్లు కేటాయించి అవమానించారని అన్నారు. ప్రపంచంలో అత్యంత వివక్షకు, లైంగిక వేధింపులకు గురైన వర్గం ట్రాన్స్ జెండర్స్ అని అన్నారు. ప్రభుత్వాల సానుభూతి బడ్జెట్ కాదు మాకు కావలసింది.. ఆత్మగౌరవాన్ని కాపాడే బడ్జెట్ కేటాయింపులు కావాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా వివక్షతో కూడి, అరకొర బడ్జెట్ మాకోద్దన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ట్రాన్స్ జెండర్లకు కమ్యూనిటీ షెల్టర్, హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్ జెండర్ల అరోగ్య సమస్యలు ప్రభుత్వాలే పట్టించుకోవాలని..జెండర్ సమస్యలను లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు 32 మందికి మాత్రమే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసారని.. అర్హత కలిగిన వారందరికీ అవకాశాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ ఆక్టివిస్ట్ లిల్లీ, ఉమెన్ ఆక్టివిస్ట్ స్వేచ్ఛ, ఆయుషా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page