గాంధీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
హైదరాబాద్, జూన్ 21, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ చౌరస్తా సమీపంలోని పి అండ్ టి పార్క్ ( సురభి పార్క్లో ) అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై స్థానిక కాలనీవాసులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ… యోగ అంటే కేవలం వ్యాయామం కాదు, శరీరం–మనస్సు–ఆత్మల సంగమం అని అన్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన వరం యోగ అని పేర్కొన్నారు. ప్రతి శ్వాసలో ఆరోగ్యం, ప్రతి ఆసనంలో శాంతి దాగుందన్నారు. వేల సంవత్సరాల భారతీయ సంస్కృతికి ప్రతీక యోగ అని తెలిపారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కృషితో నేడు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవంగా విశ్వమంతా జరుపుకుంటోందన్నారు. ఈ యోగా కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, వెంకటరమణ, శశికాంత్, సాయి గౌడ్, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply