Saturday, September 19, 2026
No menu items!
Homedevotionalబోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం

బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం

📰 Generate e-Paper Clip

బోనాల ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఆహ్వానం

హైద‌రాబాద్‌, జూలై 26, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా, ఘనంగా జరుపుకునే బోనాల పండుగకు మంత్రి వివేక్ వెంకటస్వామి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకావాలని మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ ఆహ్వానించారు. ఆహ్వానాన్ని అందజేసిన వారిలో ఐఎన్‌టియుసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఆర్‌డి.చంద్రశేఖర్, చీఫ్ వైస్ చైర్మన్ ఎం.రాజిరెడ్డి కూడా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం పలువురు మంత్రులు పిసిసి చీప్ తో పాటు అమార్తిలను కలిసి ఈనెల 29న జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరుపనున్న బోనాల పండుగ ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ దాదాపు నెల రోజుల పాటు ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల ఉత్సవాలు హైదరాబాద్ నగరలోని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని వివరించారు.

మంత్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు మాజీ ఎంపీ, ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. గౌరవ అతిథులుగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణణ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాద‌వ్‌, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ లు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈనెల 29 వ తేదీన సాంప్రదాయ బద్ధంగా, ఊరేగింపుగా బోనాలను అమ్మవారికి సమర్పించనున్నట్లు, ఈ ఉత్సవాల్లో ఉద్యోగులు, కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆదిల్ షరీఫ్ కోరారు. యూనియన్ జనరల్ సెక్రటరీ ఏవీఎస్ గాంధీ, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కె.శివకుమార్, యూనియన్ మహిళ కమిటీ చైర్ పర్సన్ ఎల్.మెర్సీ తదితరులు ఈ బోనాల ఉత్సవాలకు హాజరుకానున్నట్లు ఆదిల్ షరీఫ్ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page