Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఎస్‌జి ఎంట‌ర్‌ప్రైజెస్ కంపెనీ పేరుతో ముత్తినేని లక్ష్మి ప్రసన్న మోసం చేశార‌నేది వాస్త‌వం కాదు – ...

ఎస్‌జి ఎంట‌ర్‌ప్రైజెస్ కంపెనీ పేరుతో ముత్తినేని లక్ష్మి ప్రసన్న మోసం చేశార‌నేది వాస్త‌వం కాదు –   కొప్పుల సుమన్, స్వాతి

📰 Generate e-Paper Clip

ఎస్‌జి ఎంట‌ర్‌ప్రైజెస్ కంపెనీ పేరుతో ముత్తినేని లక్ష్మి ప్రసన్న మోసం చేశార‌నేది వాస్త‌వం కాదు

–   కొప్పుల సుమన్, స్వాతి


హైదరాబాద్, జులై 23, అద్దం న్యూస్ :    ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేట‌ర్‌గా పనిచే స్తున్న ముత్తినేని లక్ష్మీప్రసన్న పేరు మీద ఎస్‌జి ఎంట‌ర్‌ప్రైజెస్ కంపెనీని ఏర్పాటు చేసి, మోసం చేశారనే అంశంలో వాస్త‌వం లేద‌ని కొప్పుల సుమన్, స్వాతి లు తెలిపారు. బుధ‌వారం వారు మాట్లాడుతూ… తమ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి, కోట్ల రూపాయలు దండుకున్న ఎస్‌జి ఎంటర్‌ప్రైజెస్ నిర్వా హకులు ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేట‌ర్‌గా పనిచే స్తున్న ముత్తినేని లక్ష్మీప్రసన్న పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని గ‌తంలో మేము ఫిర్యాదు చేశామ‌న్నారు. సజ్జ సతీష్ మాట‌లు విని ముత్తినేని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పై మేము కేసు వేశామ‌ని, వాస్త‌వాలు తెలిశాక కేసును ఇప్పుడు విర‌మిస్తున్న‌ట్లు సుమ‌న్‌, స్వాతి లు స్ప‌ష్టం చేశారు. ఐసిఎఫ్ఏఐ యూనివర్సిటీ ఉద్యోగి అయిన ముత్తినేని లక్షీప్రసన్న గత పత్రికా ప్రకటనలో సజ్జా సతీష్ ప్రమేయం ఉన్న ఆర్ధిక లావాదేవీల కుంభకోణం గురించి తెలియజేశారన్నారు. పరిస్థితులను జాగ్రత్తగా సమీక్షించిన మీదట ఆమె వివరణ అందుకున్న పిదప FIR నం.666/2025 లో ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నట్లు భావించబడే సజ్జా సతీష్ కుట్ర‌తో ముత్తినేని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పేరును దుర్వినియోగం చేయబడి ఉండవచ్చునని ఇపుడు మేము భావిస్తున్నామ‌ని సుమ‌న్‌, స్వాతి లు పేర్కొన్నారు. పోలీస్ విచారణలో కూడా ముత్తినేని లక్ష్మి ప్రసన్న అని విధాలుగా సహకరిస్తారని మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ దిద్దుబాటుకు సంబంధించిన తాజా విషయాన్ని, స్పష్టీకరణను సజ్జా సతీష్ ప్రధాన ముద్దాయి అని, పోలీసులు వెంటనే సజ్జ సతీష్ అరెస్ట్ చేయాలని సుమ‌న్‌, స్వాతి లు కోరారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page