Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను గెరావ్ చేసిన నిరుద్యోగులు

ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను గెరావ్ చేసిన నిరుద్యోగులు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను గెరావ్ చేసిన నిరుద్యోగులు

హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ :    ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్‌ను నిరుద్యోగులు గెరావ్ చేశారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యం ఆవ‌ర‌ణ‌లో గ‌ల శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి దేవాల‌యంలో మంగ‌ళ‌వారం బోనాల ఉత్స‌వాలు జ‌రిగాయి. అయితే గ్రంథాల‌యం సంస్థ ఉద్యోగులు ఒక బోనం స‌మ‌ర్పించ‌గా, నిరుద్యోగులు సైతం మ‌రో బోనాన్ని అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తామ‌ని చెప్ప‌డంతో గ్రంథాల‌యం సంస్థ ఉద్యోగులు స‌సేమిరా అన్నారు. దీంతో నిరుద్యోగులు త‌మ నిరుద్యోగుల‌ బోనాన్ని స‌మ‌ర్పించారు. ఇదిలా ఉండ‌గా ఈ ఉత్స‌వాల‌కు ఎమ్మెల్సి అద్దంకి ద‌యాక‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అప్ప‌టికే గుర్రుగా ఉన్న నిరుద్యోగులు అద్దంకి ద‌యాక‌ర్ వ‌చ్చిన సంగ‌తి తెలుసుకుని ఆయ‌న్ను గెరావ్ చేశారు. జాబ్ క్యాలెండ‌ర్ ఏమైంద‌ని, రాహుల్ గాంధీ వ‌చ్చి ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌య‌ని ? జీపీఓ నోటిఫికేషన్ పై నిల‌దీశారు. కాంగ్రెస్ నాయ‌కులు వ‌చ్చి హామీలిచ్చారు కానీ ఆ త‌ర్వాత క‌న‌బడుట‌లేద‌ని, మిమ్మ‌ల్ని న‌మ్మి ఓట్లు వేస్తే ఈ రోజు క‌నీసం నిరుద్యోగులు ఉన్నార‌నే విష‌యాన్ని కూడా గుర్తించ‌డంలేద‌ని నిరుద్యోగులు అద్దంకి ద‌యాక‌ర్‌తో వాపోయారు. ఇటీవ‌ల రియాజ్‌, బ‌ల్మూరి వెంక‌ట్‌లు వ‌చ్చి వెళ్లిపోయారు.. కానీ మాకు జాబ్ క్యాలెండ‌ర్‌ను ప్ర‌క‌టించ‌డంలేద‌న్నారు. అద్దంకి ద‌యాక‌ర్‌కు నిరుద్యోగులు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. నిరుద్యోగుల‌ను స‌ముదాయించి ఖ‌చ్చితంగా నిరుద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అద్దంకి ద‌యాక‌ర్ చెప్పారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page