చ‌దువుకున్న వారే వృద్ధుల‌ను భారంగా భావించి హింసిస్తున్నారు

చ‌దువుకున్న వారే వృద్ధుల‌ను భారంగా భావించి హింసిస్తున్నారు
– తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి

హైద‌రాబాద్‌, జూన్ 14, ( అద్దం న్యూస్ ) :   చదువుకున్నవారే వృద్ధులు భారమని భావించి మాటలతో, చేష్టలతో హింసించే ధోరణి పెరిగిపోతుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నేడు ( జూన్ 15 ) వరల్డ్ ఎల్డర్ ఎబ్యూస్ అవేర్నెస్ డే సంద‌ర్భంగా ఆదివారం ఆయ‌న మాట్లాడుతూ… వర్తమాన కాలంలో సంకుచిత మనస్తత్వంతో ఎవరికి వారే యమునా తీరే అనే రివాజుతో జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనాధలుగా బ్రతుకుతున్నారన్నారు. ఈ దుస్థితిని నివారించి వృద్ధులను సమాజంలో భాగస్వామ్యం చేసి వారు అనుభవించే శారీరక మానసిక హింసలను నివారించి వృద్ధుల మానవ హక్కులను గౌరవించడానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి జూన్ 15వ తేదీన వరల్డ్ ఎల్డర్ ఎబ్యూస్ అవేర్నెస్ డే గా జరుపుతారని తెలిపారు. దేశంలో 2007లో తల్లిదండ్రుల కోసం చట్టం తెచ్చిందని, అదే విధంగా రాష్ట్రప్రభుత్వం కూడా 2025లో చట్టం తెచ్చిందన్నారు. సమాజంలోని పౌరులు తన బాధ్యతను గుర్తించి ప్రేమను బాధ్యతను… కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించడం వల్ల పుణ్యం పురుషార్థం దక్కుతుందన్నారు.

పాఠశాల నుండి విద్యాబుద్ధులు నేర్పాలని, త‌ల్లిదండ్రుల‌ పట్ల శ్రద్ధ వహించి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో ఉపాధ్యాయులు నేర్పించాలన్నారు. నైతిక ప్రవర్తన పెంపుదలకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. అప్పుడే పెరిగి పెద్దవారైనా తర్వాత వారిలో తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మానవ సంబంధాలు మర్చిపోయి రక్త సంబంధాలు విచ్ఛిన్నం అనేక మాణ‌వీయ పరిణామాలను రోజు చూస్తున్నామ‌ని తెలిపారు. యువత విలువలకు వివరంగా నెట్టబడి సంస్కారహీనులై సమాజానికి భారంగా తయారవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాశ్చ్యాత్య‌ నాగరికత ప్రభావం.. ఉద్యోగాల కోసం ఇల్లు విడిచి వెల్లడం.. ఉమ్మడి కుటుంబం వేరుపడి న్యూక్లియర్ కుటుంబాలుగా మారడం త‌దిత‌ర అంశాల వ‌ల్ల‌ మానవ సంబంధాల బాంధవ్యాలను సన్నగిల్లి మానవత్వం మసకబారిన పడిపోతున్నాయన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page