300 డివిజ‌న్ల‌ల్లో 23 డివిజ‌న్ల‌నే ద‌ళితుల‌కు కేటాయించ‌డం అన్యాయం – అఖిలపక్ష దళిత కమిటీ నాయ‌కులు

300 డివిజ‌న్ల‌ల్లో 23 డివిజ‌న్ల‌నే ద‌ళితుల‌కు కేటాయించ‌డం అన్యాయం
– అఖిలపక్ష దళిత కమిటీ నాయ‌కులు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 17, అద్దం న్యూస్ :    300 డివిజ‌న్ల‌ల్లో 23 డివిజ‌న్ల‌నే ద‌ళితుల‌కు కేటాయించ‌డం అన్యాయమ‌ని అఖిలపక్ష దళిత కమిటీ నాయ‌కులు అన్నారు. ముషీరాబాద్ అఖిలపక్ష దళిత కమిటీ ఆధ్వర్యంలో శ‌నివారం అడిక్‌మెట్‌లో విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అఖిల ప‌క్ష ద‌ళిత క‌మిటీ నాయకులు శ్యామ్ సుంద‌ర్ చిట్టి, గండి కృష్ణ‌, గ‌జ్జ‌ల సూర్య‌నారాయ‌ణ‌, సిరిగిరి శ్యామ్‌, కేశ‌వ‌పురం స్వామి, గ‌డ్డం న‌వీన్ లు మాట్లాడుతూ… 2011 జనాభా లెక్కల ప్రకారం దళితులకు 300 డివిజ‌న్ల‌ల్లో 14.7 శాతం ప్ర‌కారం 42 డివిజ‌న్ల‌కు గాను 23 డివిజన్లను కేటాయించ‌డం ద‌ళితుల‌కు తీవ్ర అన్యాయ‌మ‌ని అన్నారు. 2024 లెక్కల ప్రకారం దళితుల జనాభా ఎంత ఉందని బయట పెట్టాలని, అలాగే కనీసం 42 డివిజన్లు దళితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు తీరని అన్యాయం చేసిందని నాయకులు ముక్తకంఠంతో విమర్శించారు.

ఈ అంశంపై త్వ‌ర‌లోనే అన్ని రాజ‌కీయ పార్టీలలో ఉన్న ద‌ళిత నాయ‌కుల‌ను క‌లిసి అఖిల ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హిస్తామ‌న్నారు. ద‌ళితుల‌కు 50 నుంచి 55 డివిజ‌న్ల‌ను పెంచే విధంగా కార్య‌చ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. మూడు కార్పొరేష‌న్ల‌కు గాను ఒక మేయ‌ర్ సీటును ద‌ళితులకు కేటాయించాల‌న్నారు. ఈ స‌మావేశంలో జి.వెంకటేష్, రామస్వామి, హరీష్, కిషోర్, రామచందర్, శ్రీధర్, సత్యనారాయణ, సదా, భానుప్రసాద్, నర్సింగ్ రావు, గంట‌ల‌ రాజు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page