పింగళి వెంకయ్య చరిత్ర విస్తృత ప్రచారం కల్పించిన జగదాంబకు స్వర్ణకంకణ ప్రదానం
హైదరాబాద్, డిసెంబర్ 23, అద్దం న్యూస్ : జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్యను ప్రతి ఒక్కరు స్మరించుకునే విధంగా పింగళి వెంకయ్య ట్రస్ట్ ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారాన్ని కల్పించిన కెహెచ్ఎస్ జగదాంబను స్వర్ణకంకణ వరించింది. ఆకాంక్ష్ ఇంటర్నేషనల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ హిమాయత్‌నగర్ సరేగ స్టూడియోస్‌లో స్వర్ణకంకణ ప్రదానోత్సవం జరిగింది. గత కొన్ని రోజుల కింద తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన జగదాంబ తరపున వారి కుటుంబసభ్యులు శ్రీకాంత్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి లు హాజరై శ్రీకాంత్‌కు స్వర్ణకంకణాన్ని అందచేశారు. పింగళి వెంకయ్య ట్రస్ట్ ద్వా రా మహోన్నత శిఖరాలను అధిరోహించిన గొప్ప మహిళా పురస్కారాలను జగదాంబకు దక్కడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ అధ్యక్షుడు జీఎంజి అర్జున్, స్వచ్ఛ భరత్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బి.విజయ్ రంగ, బింగి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply