Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadజగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332 వ ఆరాధన మహోత్సవాలు

జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332 వ ఆరాధన మహోత్సవాలు

📰 Generate e-Paper Clip

 

జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332 వ ఆరాధన మహోత్సవాలు

 

హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ :   జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332 వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బుధ‌వారం ట్యాంక్‌బండ్ పై గ‌ల పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవ కమిటీ చైర్మన్ అట్లూరి రవీంద్రచారి, కరుణశ్రీ దంపతుల ఆధ్వర్యంలో జరిగింది. అట్లూరి రవీంద్ర చారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం నాయకులు పెద్దోజు రవీంద్రాచారి ఆరాధన ఉత్సవాలలో పాల్గొని బ్రహ్మం విగ్ర‌హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పెద్దోజు రవీంద్రాచారి మాట్లడుతూ… వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన కర్తగా, గొప్ప దార్శనికునిగా, మహా తత్త్వవేత్తగా, ఒక యోగిగా, సంఘ సంస్కర్తగా అవతార పురుషుడని అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ తత్త్వాల ద్వారా, ఇతర రచనల ద్వారా, సామాజిక విప్లవాన్ని సాధించిన మహనీయుడని, సమాజంలోని మూఢ విశ్వాసాలను ఖండిస్తూ అజ్ఞానంలో మగ్గిపోతున్న మానవాళికి జ్ఞానోదయాన్ని కల్గించిన క్రాంతిదర్శి. జీవన తత్త్వాన్ని తత్త్వాలుగా ప్రజల్లోకి వెదజల్లి, సామాన్యుల నుండి పండితుల వరకు అందరినీ ప్రభావితం చేసారన్నారు. తెలుగు సాహిత్యంలో, తెలుగు వారైన యోగి పుంగవులలో గురు శ్రేష్ఠులలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిన చైతన్యమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అని అన్నారు. ఆనాడు చెప్పిన కాలజ్ఞాన వేదవాక్కులు సత్యవాక్కులుగా నిరూపితమై నాటికి, నేటికి నిజమవుతున్నాయి. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు యుద్ద వాతావరణం బెంగాల్ అల్లర్ల గురించి మరియు కాశ్శీర్ ఉగ్రవాద దాడుల గురించి ఆనాడే ఆయన భోదనలలో తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్.ప్రకాష్, మేడ్చల్ సత్యనారాయణ, తిరుమూర్తుల గౌరిశంకర్, చింతోజు మాధవా చారి, కొల్లూరి శ్రీనివాసా చారి, మహరాజు రవీంద్రా చారి, నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page