ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య కలహాలు రేపే ప్రయత్నం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవిత
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ : రెండు రాష్ట్రాలుగా విడిపోయి, అభివృద్ది పథంలో దూసుకెళ్తున్నసమయంలో తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా సోదర భావముతో సౌభ్రాతృత్వంతో కలిసి మెలిసి ఉన్న ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య తగుదునమ్మా అని కలహాలు రేపే ప్రయత్నం జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్నారని తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పోలవరం ముంపు ప్రాంతాలైన తెలంగాణలోని ఆరు (ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల, పిచుకల పాడు) గ్రామాలను తిరిగి తెలంగాణాలో విలీనం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తున్న కారణంగా ప్రాంతీయవాదం రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందని, ఇటువంటి ప్రజా ద్రోహులను రాజకీయాల నుండి తరిమివేయాలని అన్నారు. ఆ గ్రామాలు కలిసి 10 ఏళ్ళు దాటుతున్నా, అప్పుడప 10ఏళ్లు అధికారంలో ఉండి, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ గ్రామాల సమస్య గుర్తుకు రాలేదా ? అప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించలేదన్నారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీ తండ్రి కెసిఆర్‌ను విలేకరులు ప్రశ్నిస్తే, ముంపు మండలాలు మనవి కావు, అది ముగిసిన అధ్యయనం. వాటిపై చర్చ అవసరం లేదంటూ సమాధానం చెప్పారని, కెసిఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన రోజు కూడా ఈ గ్రామాలలో నిర్వహించలేదని.. అప్పుడు మీ తండ్రి కెసిఆర్ ను ఎందుకు నిలదీయలేదు ? ఎందుకు ప్రశ్నించలేదు ? ఎందుకు లేఖ రాయలేదు ? సాయిబాబా ప్రశ్నించారు. ఈనాడు కొత్తగా తెరపైకి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం అనేది తన ఉనికిని కాపాడుకోవాలని చేస్తున్న ప్రయత్నమేనని అన్నారు. అధికారంలో ఉన్న10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల గురించి ఏనాడో పట్టించుకోక కేవలం ప్రజాధనం దోపిడి మాత్రమే ప్రధాన లక్ష్యంగా అందినంత దోచుకుని, కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్న వీళ్లు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందనే భయంతో ముందుగానే తెలుగదేశంపై బురదజల్లి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలుచేయాలని చేస్తున్న జమ్మికులేనని అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి, రైలు రోఖోలు చేస్తామనడం, ముంపు గ్రామాలు కలపాలని లేఖ రాయడం కేవలం రాజకీయమే అని విమర్శించారు. ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి, ఈరోజు కొత్తగా ఆరు గ్రామాల కలపాలని అనడం ఆమె దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. పక్కవాడు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని మనస్తత్వం అన్నారు. మద్యం కుంభకోణంలో దండుకున్న కోట్లాది రూపాయలను ఎలా ఖర్చు చేయాలో అర్థం కాక, ప్రజలను తప్పుదోవ పట్టింటే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ఏనాడైతే తెలంగాణ వాదాన్ని పక్కనపెట్టి టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్‌గా పేరు మార్చారో ఆ రోజే ప్రజలు మిమ్మల్ని కూడా పక్కన పెట్టారని, అందుకే మీకు ఈ గతి పట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, ఎం.రాజు. సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply