హైదరాబాద్, జూన్ 3, అద్దం న్యూస్ : మలక్‌పేట్ నల్గొండ చౌరస్తాలో సీవరేజ్ మరమ్మత్తు పనులను మంగళవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు. మలక్‌పేట్ అక్బర్ ప్లాజా వద్ద మురుగు సమస్య తలెత్తి ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది. దీంతో జలమండలి అధికారులు పర్యటించి రెండు దశాబ్ధాల క్రితం సీవరేజ్ లైను శిథిలమైపోవడంతో అవుట్‌లెట్ లేక వర్షం కురిసిన సమయాల్లో సీవరేజ్ రహదారిపై పొంగుతున్నట్టు గుర్తించారు. ఇదే ప్రాంతంలో జీహెచ్ఎంసీ వాననీటి కాలువ ఉండడం, ట్రాఫిక్ రద్దీ ఉండడం, సీవరేజ్ లైన్లు ధ్వంసమైన ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. అలాగే సమీపంలోని భవణాలనుంచి ఉత్పన్నమయ్యే సీవరేజ్‌ను ఎక్కడికక్కడే కాకుండా ఓకే అవుట్‌లెట్ వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సమీపంలోని అన్నీ సీవరేజ్ లైన్లను, మ్యాన్‌హోళ్లను డీ సిల్టింగ్ చేసి మురుగు పొంగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారంకోసం ఇరు శాఖల అధికారులు సర్వే నిర్వహించాలని అన్నారు. నగరంలోని సీవరేజ్, వాననీటి కాలువ అనుసంధానం అయ్యే పాయింట్లను గుర్తించాలని, ఆ ప్రాంతాల్లో రెండు లైన్లను వేరువేరుగా నిర్మిస్తే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. దీనికోసం ఇరుశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సీవరేజ్ ఓవర్ ఫ్లోకు కారణమైన హోటల్‌కి రూ.10 వేల జరిమానా :
నల్గొండ చౌరస్తాకు ఆనుకొని ఉన్న భవనంలో హోటల్ యజమాని తన సీవరేజ్ లైనును నేరుగా జలమండలి సీవరేజ్ నెట్వర్క్‌కు అనుసంధానం చేసి అందులో ఆహార, వ్యర్థ పదార్థాలను వేస్తూ వస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో మ్యాన్‌హోళ్లు నిండిపోయి రహదారులపై మురుగు పారుతుంది. ఈ నిర్లక్ష్యం వహించిన హోటల్ యజమానిపై ఎండీ అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీవరేజ్ ఓవర్ ఫ్లోకు కారణమైన హోటల్ యజమానికి రూ.10 వేల జరిమానా విధించమని అధికారులను ఆదేశించారు. అలాగే 10 రోజులలో సిల్ట్ ఛాంబర్ నిర్మించుకోకపోతే జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి హోటల్‌ను సీజ్ చేయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం ఇతర అధికారులు, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply