హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన కు తెలంగాణ జన సమితి వినతి పత్రం సమర్పించింది. సోమవారం గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.నరసయ్య నేతృత్వంలో ప్రతినిధి బృందం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని అర్హులైన ఉద్యమకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ప్రకటించిన విధంగా 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని నరసయ్య కోరారు. కలెక్టర్ కు కలిసి వినతి పత్రం సమర్పించిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, లీగల్ సెల్ కన్వీనర్ ట్రాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్, ఉపాధ్యక్షులు ఎం లక్ష్మణ్, జైపాల్ రెడ్డి, అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షుడు కాకునూరు సుధాకర్ తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply