అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో పూల ధరలు ఆకాశాన్నంటాయి. నూతన సంవత్సర వేడుకలు, వైకుంఠ ఏకాదశి, మార్గళి మాసం పూజల కారణంగా పూలకు (Jasmine Flower) డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి తోడు మంచు ప్రభావంతో దిగుబడి తగ్గడంతో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా సువాసనలకు పెట్టింది పేరైన మధురై మల్లెపూల (Jasmine Flower) ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
తేని జిల్లా ఆండిపట్టి మార్కెట్‌లో కిలో మల్లెపూల (Jasmine Flower) ధర ఏకంగా రూ.3,000 పలికింది. మధురై మార్కెట్‌లోనూ ఇవి రూ.2,500 వరకు విక్రయించారు. కేవలం మల్లెపూలే కాకుండా, ఇతర పూల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కనకాంబరం కిలో రూ.2,500, ముల్లై పూలు రూ.1,200, పన్నీరు గులాబీలు రూ.200 చొప్పున అమ్ముడవుతున్నాయి.
ప్రతికూల వాతావరణం వల్ల పూల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడం, దానికి తోడు పండుగ సీజన్ కావడంతో ఈ (Jasmine Flower) ధరల పెరుగుదల చోటుచేసుకుంది. రాబోయే సంక్రాంతి పండుగ నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పూల ధరలు ఇలా మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply