బోర్డు తిప్పేసిన ప్యూరోపాల్ ఐటీ సంస్థ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలి
నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలను దోచుకుంటున్ననకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీలను మూసివేయాలి
నకిలీ ఐటీ జాబ్ రాకెట్‌లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి


ధర్నాలో మాట్లాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : నేరపూరిత నమ్మక ద్రోహం చేస్తున్న హైదరాబాద్ మాదాపూర్, గచ్చి బౌలి లోని స్కిల్ హబ్ వంటి నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీ లను మూసివేయాలని, బోర్డు తిప్పేసిన ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సోలుషన్స్ కంపెనీ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేసారు. ప్యూరోపాల్ ఐటీ సంస్థ బాధిత నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ, నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీ లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్, ధర్నాచౌక్ వద్ద శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బాధిత నిరుద్యోగులతోపాటు పాల్గొన్న డాక్టర్ దిడ్డి సుధాకర్ ధర్నానుద్దేశించి మాట్లాడుతూ… ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ వద్ద శిక్షణ పొందితే ఆయా సంస్థల్లో జాబ్ గ్యారెంటీ అంటూ నిరుద్యోగులను ఆకర్షించి మాదాపూర్‌లోని స్కిల్ హబ్ కన్సల్టెన్సీ సంస్థ మోసపూరితంగా గచ్చిబౌలిలోని ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్‌లో ఉద్యోగాలు ఇప్పించిందని, ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్ ఒక్కొక్కరి నుండి లాప్ టాప్, సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిందని, చేరిన రెండు నెలలకే జీతాలు కూడా ఇవ్వకుండా ఆ కంపెనీ బోర్డ్ తిప్పేసిందని, దింతో దాదాపు 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేసి వారం రోజులు గడిసిన ఇప్పటి వరకు పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీ లు, కంపెనీలు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ తప్పుడు హామీలతో అనేక మంది ఐటీ ఉద్యోగ ఆశావహులను మోసం చేస్తున్నారని అన్నారు. నకిలీ ఐటీ జాబ్ రాకెట్‌లను అరికట్టేందుకు ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనీ డాక్టర్ దిడ్డి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఆప్ యువజన విభాగం రాష్ట్ర నేత విజయ్ మల్లంగి మాట్లాడుతూ… హైదరాబాద్ మాదాపూర్, గచ్చిబౌలీలో రోజు రోజుకు భారీగా ఐటీ ఉద్యోగాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని తెలిపారు. నకిలీ ఐటీ జాబ్ కన్సల్టెన్సీ, ఐటీ కంపెనీలపై పోలీసులు నిఘా పెట్టి వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఆప్ రాష్ట్ర నేత బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ… ప్యూరోపాల్ ఐటీ సోలుషన్స్ కంపెనీ మోసం పై గుచ్చి బౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేస్తుందని, వారి డబ్బులు వారికి ఇప్పించి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలనీ కోరారు. ఈ ధర్నాలో ఆప్ నేతలు డాక్టర్.లక్ష్య నాయుడు, రాకేష్ రెడ్డి, బాబూలాల్ పవార్, అజీమ్ బేగ్, రాకేష్ రెడ్డి, షాబాజ్, లియాఖత్ ఖాన్, హేమ జిల్లోజు, మదన్ లాల్, గుత్తా నాగేశ్వర్ రావు, టి.రాకేష్ సింగ్, సోహైల్, దర్శనం రమేష్, అబ్బాస్, జీషాన్, రామన్ స్వామి మరియు భాదితులు, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply