మారిశెట్టి నర్సింగరావు ఆధ్వర్యంలో జ్యోతిబా ఫులే జయంతి
హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ మారిశెట్టి నర్సింగరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమం జరిగింది. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఆంధ్రా కేఫ్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ హాజరై జ్యోతిబా ఫులే చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం సత్యనారాయణ, గుర్రం శంకర్, బాబ్జి, జగదీష్ బాబు, సుబ్బన్న, నవీన్, మోహన్, దేవి వర ప్రసాద్, అభిషేక్, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, చందు, అప్పు, రాజేష్, శంకర్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply