Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadదళిత వర్గాల విద్య, సామాజిక సమానత్వం కోసం ఉద్యమించిన మ‌హ‌నీయుడు జ్యోతిరావ్ ఫూలే – గాంధీన‌గ‌ర్...

దళిత వర్గాల విద్య, సామాజిక సమానత్వం కోసం ఉద్యమించిన మ‌హ‌నీయుడు జ్యోతిరావ్ ఫూలే – గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్‌

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్   దళిత వర్గాల విద్య, సామాజిక సమానత్వం కోసం ఉద్యమించిన మ‌హ‌నీయుడు జ్యోతిరావ్ ఫూలే అని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. శుక్ర‌వారం నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావ్ ఫూలే జయంతి వేడుకలు డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ.. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు గొప్ప కృషి చేశార‌న్నారు. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ( సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ) ను ఏర్పాటుతో పాటు భారత దేశ బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించార‌న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, ధోనేటీ సత్యం, శ్రీనివాస్, సాయి కుమార్, సంయుక్తారాణి తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page