Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadమహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

📰 Generate e-Paper Clip

 

మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 11, అద్దం న్యూస్  మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమ‌ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైద‌రాబాద్ ఫిలీంన‌గ‌ర్‌లో మ‌హాత్మా జ్యోతిబా ఫూలే 199వ జ‌యంతి వేడుక‌లు శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజ‌రై జ్యోతిబా ఫూలే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా నిరంతరం ఉద్యమంలో పాల్గొంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు పాటుపడిన మదేశి రాజేందర్‌కు శాలువా, మెమొంటోతో స‌న్మానం జ‌రిగింది. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బిసి జెఎసి, మ‌హాత్మా జ్యోతిబా ఫూలే క‌మిటీ ఛైర్మ‌న్ చిన్న శ్రీశైలం యాద‌వ్ లు రాజేంద‌ర్‌ను ఘ‌నంగా స‌న్మించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page