...

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రథ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే  – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌న్వీన‌ర్ అర‌వింద్‌కుమార్ గౌడ్

 

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రథ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే 

– టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌న్వీన‌ర్  అర‌వింద్‌కుమార్ గౌడ్

హైదరాబాద్, అద్దం న్యూస్  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రథ‌మ‌ సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌న్వీన‌ర్ అర‌వింద్‌కుమార్ గౌడ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలె జయంతి కార్య‌క్ర‌మం జిల్లా పార్టీ కార్యాలయంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేట‌ర్ క‌న్వీన‌ర్ అర‌వింద్‌కుమార్ గౌడ్, టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… బలహీన వర్గాల ప్రజలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి. జ్యోతిరావు ఫూలే అని, సత్యశోధక్ సమాజ్ స్థాపించి దాని ద్వారా ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సమాజ సేవ చేసారన్నారు. ముఖ్యంగా వితంతు పునర్వివాహాలు, మహిళలకు విద్య మొదలైన సామాజిక సంస్కరణలో పూలె కృషి అంబేద్కర్‌ను ప్రభావితం చేశాయన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అధికారం కల్పించాలన్నదే ఫూలె సంకల్పమ‌న్నారు. ఆ సంకల్పం సాధన కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఆనాడు ఎన్టీఆర్ చేపట్టి సంక్షేమ కార్యక్రమాలు, ఆతర్వాత చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ది పూలె ఆశయాలను ఆచరణలో పెట్టడంమేనని అన్నారు.

సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్యక్షుడు సాయిబాబా మాట్లడుతూ… మహాత్మా జ్యోతిరావు ఫూలె బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఒక గుర్తింపు తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తి. ఇటువంటి మహావ్యక్తికి భారతరత్న ప్రకటించాలని సాయిబాబా డిమాండ్ చేసారు. ప్రస్తుత ప్రభుత్వాలు బలహీన వర్గాల ప్రజల పట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ నాయకులు బిసీల రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో చెప్పాలన్నారు. బీసీ నాయకుడని జాతీయ హిందూ బీసీ సంఘం అధ్యక్షుడు సిద్దేశ్వర్‌ను తమ వెంట ఢిల్లీకి తీసుకువెళ్లారన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి సిద్దేశ్వర్ ఆమరణ నిరాహార దీక్షకు చేస్తున్న సిద్దేశ్వరును పట్టించునే వారు లేర‌న్నారు. కనీసం జ్యోతీరావు పూలె జయంతి సందర్బంగానైనా సిద్దేశ్వర్‌ను దీక్ష విరమింప జేయాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్, ఎం.రాజు, జాన్సీ, ప్రమీల, ఎబిఆర్.మోహన్, జగదీష్ గౌడ్, ప్రసాద్, రామారావు, బి.రాజు, సుక్రవేది, మహేంధర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.