Wednesday, November 18, 2026
No menu items!
Homedevotionalఅంగ‌రంగ వైభ‌వంగా వరంగల్ భద్రకాళి భద్రేశ్వర కల్యాణోత్సవం

అంగ‌రంగ వైభ‌వంగా వరంగల్ భద్రకాళి భద్రేశ్వర కల్యాణోత్సవం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 17, ( అద్దం న్యూస్ ) :

హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో కొన‌సాగుతున్న కోటి దీపోత్సవం మంగ‌ళ‌వారం నాలుగో రోజుకు చేరింది. వేదపఠనం, మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం, భక్తిగీతాలు, ప్రవచనాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ విద్యారణ్య వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. సంగీత సిస్టర్స్ బృందం భక్తిగీతాలు ఆలపించగా, జయసూర్య బృందం వయోలిన్ వాయిద్య ప్రదర్శన ఇచ్చింది. డాక్టర్ ఎన్.అనంతలక్ష్మి ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది.

        తదనంతరం వరంగల్ భద్రకాళి, బల్కంపేట ఎల్లమ్మ, ఏడుపాయల వనదుర్గ, వరంగల్ పద్మాక్షి, గాజుల రామారం చిత్తారమ్మ, బోడుప్పల్ నిమిషాంబిక, ఈఎస్ఐ విజయలక్ష్మి, ప్రొద్దుటూరు కన్యకాపరమేశ్వరి అమ్మవార్లకు కోటి కుంకుమార్చన నిర్వహించారు. వరంగల్ భద్రకాళి భద్రేశ్వర కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతి డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామి, కుక్కె సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతి శ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామి హాజరై భక్తులకు అనుగ్రహభాషణం అందించారు.

        అనంతరం 108 మంది భక్తులతో బంగారు శివలింగం వద్ద పంచహారతులు నిర్వహించారు. అమ్మవార్ల పల్లకీలను ఒకేసారి ఊరేగించారు. పీఠాధిపతులు, అతిథులు, నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన, భక్తులచే సామూహిక కార్తీక దీపారాధన నిర్వహించారు. సప్తహారతి, మహానీరాజనం, గురువందనం, అతిథుల సత్కార కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సురభి శారద బృందం ఫ్యూజన్ నృత్యం, భరద్వాజ నాట్యమండలి అర్చన బృందం నవదుర్గ నృత్యం, వసంత సంధ్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page