Saturday, September 19, 2026
No menu items!
HomeEditorial'కలిసి నడుస్తాం'.. భారత్, రష్యా కీలక నిర్ణయాలు

‘కలిసి నడుస్తాం’.. భారత్, రష్యా కీలక నిర్ణయాలు

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఉగ్రవాదాన్ని నిర్మూలించే పోరాటంలో భారత్, రష్యా (India and Russia) కలిసి ముందుకు సాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Russian President Vladimir Putin)తో కలిసి హైదరాబాదు హౌస్ సంయుక్త ప్రకటన చేశారు. పహాల్గా మ్ ఉగ్రదాడికి పాకిస్థాన్ ఆధారిత జైషే మహ్మద్‌కు సంబంధం ఉన్నట్లు తేలినప్పుడు రష్యా భారత్‌కు బలమైన మద్దతు తెలిపిన విషయం మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుడిచిపెట్టే భారత్ ప్రయత్నాలకు రష్యా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాక్ భూభాగంలో, అలాగే ఆ దేశం అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్ర స్థా వరాలపై భారత్ చేసిన చర్యలకు కూడా రష్యా మద్దతు ఇచ్చిందని అన్నారు.

‘ఎనిమిది దశాబ్దాల్లో ప్రపంచం ఎన్నో మార్పులు, సంక్షోభాలు చూసింది. కాని భారత్-రష్యా స్నేహం మాత్రం ధృవతారలా ఎప్పటికీ నిలకడగా నిలిచింది. పరస్పర గౌరవం, లోతైన విశ్వాసం మీద నిలబె ట్టుకున్న ఈ బంధం కాలపరీక్షను ఎల్లప్పుడూ జయిస్తుంది.” అని మోదీ అన్నారు. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్యంపై కూడా రెండు దేశాలు కీలక నిర్ణయాలు ప్రకటించాయి. షిప్పింగ్ రంగానికి సంబంధించిన అవగాహన ఒప్పం దంపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణి జ్యాన్ని సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని పుతిన్ తెలిపారు. 2030

స్థానిక కరెన్సీలోనే పరస్పర చెల్లింపులు..

పశ్చిమ దేశాల్లో పెద్ద చర్చకు దారితీసే వ్యాఖ్యగా, రెండు దేశాలు తమ జాతీయ కరెన్సీల్లోనే పరస్పర చెల్లింపులు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాయని పుతిన్ వెల్లడించారు. అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయం సృష్టించే ప్రయత్నాలు బ్రిక్స్ బ్లాక్ జరుగుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఈ వ్యాఖ్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ యుద్ధం కూడా సమావేశంలో ప్రధానాంశమైంది. యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో భారతదేశం పోషిస్తున్న పాత్రకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన తన ప్రతిపాదనలను మోదీతో పంచుకున్నానని, ప్రపంచానికి శాంతిని అందించే దేశంగా భారత్ వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారని పుతిన్ తెలిపారు. వరకు ద్వైపాక్షిక వాణిజ్య ప్రవాహాలకి మార్గాన్ని చూపే ‘ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్’పై చర్చించామని, యూరేషియన్ ఎకనామిక్ యూ నియన్ తో కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై వేగంగా ముందుకు సాగుతున్నామని మోదీ చెప్పారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page