హైదరాబాద్, అద్దం న్యూస్ : కిరణ్ ఆటో మోటార్ కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. వడ్లకొండ కిరణ్ ప్రధమ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు జి.లింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… కిరణ్ ఆటో మోటార్ కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్య మించిన వ్యక్తియని కొనియాడారు. టియుసిఐ హైదరాబాద్.. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్ మాట్లాడుతూ… కిరణ్ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ట్రాఫిక్, ఆర్టిఏ, మీటర్ సీల్ అధికారుల దౌర్జన్యానికి లంచగొండి తనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తిని అన్నారు. కిరణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టియుసిఐ నగర అధ్యక్షురాలు ఎస్ఎల్.పద్మ మాట్లాడుతూ …1997లో యూనియన్‌ను ఏర్పాటు చేసి మరణించేదాకా యూనియన్ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి కిరణ్ అని కొనియాడారు. క్యాన్సర్ మహమ్మారి కాటు వేసి కార్మిక వర్గానికి దూరం చేసింద ని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఆటో యూనియన్ అధ్యక్షులు ఎ.నరేందర్ మాట్లాడుతూ… కిరణ్ తెలివైన చురుకైన వాడని ఎటువంటి ఆటుపోట్ల కైనా ఎదిరించి కొట్లాడే ధైర్య సాహసాలు కలిగిన వాడని అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఎం.అన్మేష్ మాట్లాడుతూ.. ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు కావాలని అలుపెరుగని పోరాటం చేశాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలైన మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు సంవత్సరానికి 12 వేల రూపాయలు హామీ ఇచ్చి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె నల్లన్న, ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ కాజువల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనివాస్, డి లక్ష్మి, ఆటో యూనియన్ నాయకులు హైదరాబాద్ ఏరియా కార్యదర్శి టి.నారాయణ, కొంపెల్లి ఏరియా కార్యదర్శి మొహమ్మద్ ఖాజా మియా, సికింద్రాబాద్ ఏరియా కార్యదర్శి ఎస్ రవీందర్, జె.వెంకటేష్, జి.యాదయ్య, కార్యనిర్వాహణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్, ఉపాధ్యక్షులు పి.కృష్ణ ముదిరాజ్, తాజ్ డెక్కన్ హోటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యనారాయణ, బి.వెంకటేష్, బి.ప్రభాకర్, ఎస్‌డి.నిస్సార్, ఎం ఎన్‌రెడ్డి, మెహర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply