తెలంగాణా గొంతుక వినిపించిన మొట్టమొదటి తెలంగాణావాది కొండా లక్ష్మణ్ బాపూజి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : ఆరు దశాబ్దాల క్రితమే వలస వాదుల చేతుల్లో తెలంగాణా నిర్లక్ష్యానికి గురైంతుందని గుర్తించి, తెలంగాణా గొంతుక వినిపించిన మొట్టమొదటి తెలంగాణావాది “కొండా లక్ష్మణ్ బాపూజి” అని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం అశోక్‌నగర్‌లో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… కొండా లక్ష్మణ్ బాపూజీ మాటను ప్రభుత్వం లెక్క చేయని కారణంగా మంత్రివర్గం నుండి కూడా తప్పుకొని తెలంగాణ కోసం పారాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. క్విట్ ఇండియా పోరాటంలో పాల్గొని గైర్ ముల్కీ ఆందోళనలో క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. తన జీవితాన్ని తెలంగాణ స్వయం పాలన కోసం పోరాటం సాగించి ఆ ఉద్యమంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన “తొలితరం తెలంగాణ పోరాట యోధుడు” కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
బలహీనవర్గాలు ఆప్యాయంగా బాపూజీ అని పిలుచుకునే పోరాట యోధుడన్నారు. రాష్ట్రం కోసం తొలిసారిగా నినదించి ఉద్యమించిన తెలంగాణ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణా ఆత్మ గౌరవం కోసం పోరాడిన బాపూజి సేవలు యావత్ దేశానికి జాతికే ఆదర్శమన్నారు. చివరికి ఆయన 90 ఏళ్ల వయస్సులో కూడా ఢిల్లీకి వెళ్లి నిరాహార దీక్షలో పాల్గొన్నారంటే తెలంగాణాకు నిజమైన దిక్సూచి అని సాయిబాబా కొనియాడారు. అటువంటి మహానుభావుడి వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని చారిత్రక పాఠ్యాంశంగా చేర్చాలని, ఆయన శిలా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పాలని, ఆయన ఆశయాలను, ఆదర్శాలను భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply