నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించిన కొండా శ్రీధర్‌రెడ్డి
హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 85వ జయంతి వేడుకలు సోమవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రానికి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ…. ఉద్యమకాలంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప నాయకుడు నాయిని అని అన్నారు. కార్మికుల పక్షపాతి నాయిని అని కొనియాడారు. కార్మికుల శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానేత నాయిని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ గౌడ్, టిల్లు, రాములు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply