దోమలగూడ హనుమాన్ దేవాలయం ఛైర్మన్‌గా కెఆర్‌కె.ప్రసాద్
– ఘనంగా ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం

హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడ హనుమాన్ దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం గురువారం ఘనంగా జరిగింది. టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, ఆలయ ఈవో మాచర్ల దేవనాధం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేఖ ల పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌గా కెఆర్‌కె.ప్రసాద్, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మహేందర్ పంతులు, ధర్మకర్తల మండలి సభ్యులుగా పరమేశ్వర్, వై.కృష్ణ, ఆర్.రాము, ఆర్.వెంకట్‌రెడ్డి, ఎస్.శివయాదవ్, కె.మంజుల రాణి లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ… నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయాభివృద్ధికి కృషి చేయాలన్నారు. దోమలగూడ హనుమాన్ దేవాలయం ఛైర్మన్ కెఆర్‌కె.ప్రసాద్ మాట్లాడుతూ… తన పై నమ్మకంతో ఆలయ కమిటీ ఛైర్మన్‌గా నియమించినందుకు అంజన్ కుమార్ యాదవ్‌కు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఆలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం ఎ బ్లాక్ అధ్యక్షుడు విడి.క్రిష్ణ, బి బ్లాక్ అధ్యక్షుడు అంజి యాదవ్, మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్, పలు డివిజన్ల అధ్యక్షులు భాస్కర్, పెండెం శ్రీనివాస్ యాదవ్, తిరుమల రావు, శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం పునర్నిర్మాణ కమిటీ ఛైర్మన్ మారిశెట్టి నర్సింగ్‌రావు, వివేక్‌నగర్ ఆంజనేయస్వామి దేవాలయం పునర్నిర్మాణ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం సత్యనారాయణ, జయేందర్‌బాబు, అంజిరెడ్డి, పాశం అనిల్ యాదవ్, డి.వెంకటేష్, బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతికుమార్, సంజయ్ సింగ్, సాయిబాబా, శ్రీధర్‌రాజ్, ధర్మేందర్, రమేష్ యాదవ్, బిజెపి నాయకులు సలంద్రి శ్రీనివాస్‌యాదవ్, పరిమళ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ రవీందర్, వెంకటేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొల్లగడ్డ రాజశేఖర్‌గౌడ్, కల్వగోపి, దశరథ్, అర్చకులు అల్లం ప్రభు, శేషచారి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply