భగత్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దాం.!!
- ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 2K రన్
హైదరాబాద్, అద్దం న్యూస్ : భగత్‌సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దామనే నినాదంతో ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్‌సిసి గెట్ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు 2K రన్‌ను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు టి.నాగరాజు, ఎ.వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి, డివైఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు జెకె.శ్రీనివాస్ లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్ పారద్రోలుద్దామని, అసలైన భారతదేశాన్ని నిర్మిద్దాం అని అన్నారు. సే నో టూ డ్రగ్స్ నినాదంతో యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. హైదరాబాద్ మహానగరంలో, రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నేడు మహ్మమరిగా మారి జీవితాలు ఆగం చేసుకుంటున్నారని అన్నారు. యువత, విద్యార్థులు అవగాహన లేక మత్తుకు బానిసలుగా మారుతున్నారన్నారు. నేడు జాతీయోద్యమం అంటే డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడమే అని పేర్కొన్నారు. నాడు భగత్‌సింగ్, అతని సహాచరులు బ్రిటిష్ పై దేశాన్ని దేశంలో ఉన్న యువతకు మంచి దేశాన్ని అందించాలనే సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షు కార్యదర్శులు అశోక్ రెడ్డి, లెనిన్, జావీద్, హస్మి బాబు, నాయకులు స్టాలిన్, ప్రశాంత్, నాగేంద్ర, దేవేందర్, సహన, రజనీకాంత్, రాజయ్య, హస్మిత, రవి, మాజీ నాయకులు మహేందర్, దశరథ్, విజయ్, శ్రీనివాస్ రావు, విజయ్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply