ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
– టిడిపి నేతల ధ్వజం
నాంపల్లి, జూలై 26, ( అద్దం న్యూస్ ) : ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన విమర్శించారు. నాంపల్లి నియోజకవర్గంలో పాదయాత్రతో హోరెత్తిన ” తెలుగుదేశం ప్రజా పథం ”, పతాకావిష్కరణ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం మెహదీపట్నం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన ” తెలుగుదేశం ప్రజా పథం ” కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో, ప్రజాదరణతో విజయవంతమైంది. మెహదీపట్నం డివిజన్ అధ్యక్షుడు, కంటెస్టెడ్ కార్పొరేటర్ పూసల వీరబాబు, పుప్పాల బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇ.కిషోర్ సమన్వయంలో ఈ ప్రజాపథం కార్యక్రమం జరిగింది. మెహదీపట్నం పిల్లర్ నంబర్ 19 సమీపంలోని సంతోష్‌నగర్ కాలనీలో పార్టీ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డప్రసూన, సికింద్రాబాద్ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ నల్లెల్ల కిషోర్, రాష్ట్ర బిసి సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పి.అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివిజి.నాయుడు లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంతోష్‌నగర్ కాలనీ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఎస్బీఐ కాలనీ ( SBI Colony ), సెంట్ ఆన్స్ కాలేజ్ పరిసరాలు, మెహదీపట్నం చౌరస్తా ( ఆర్ఎస్ బ్రదర్స్ ప్రాంతం ) మీదుగా డివిజన్‌లోని వివిధ ప్రధాన బస్తీలు, కాలనీల గుండా ముందుకు సాగింది. యాత్ర పొడవునా పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల కష్టసుఖాలను, నిత్యం వారు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా స్థానిక బస్తీవాసులు ఎదుర్కొంటున్న పలు తీవ్రమైన సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన పేద కుటుంబాలకు నేటికీ ఇందిరమ్మ ఇండ్లు దక్కలేదని నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, డ్రైనేజీ మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ తీవ్ర దుర్గంధం, రోగాల భారిన పడేలా చేస్తోందని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఒంటరి మహిళలకు ప్రతినెల ఇస్తామన్న రూ.2,000 ల ఆర్థిక సాయం, పింఛన్లు అందకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకునే విద్యార్థినులకు వాగ్దానం చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు నేటికీ అందకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ సందర్భంగా కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ…. ప్రజలకు ఆకర్షణీయ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకులు, నేడు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించారన్నారు. బస్తీల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా, రోడ్లు ధ్వంసమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. పేదలకు ఇండ్లు, మహిళలకు పింఛన్లు, విద్యార్థులకు స్కూటర్ల హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు తెలుగుదేశం పార్టీ వీధినపడి పోరాడుతుందన్నారు. పి.బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ… మెహదీపట్నం డివిజన్‌లోని ప్రతి బస్తీ సమస్యను వెలికితీసి, ప్రజలకు అండగా నిలవడమే ఈ ప్రజా పథం ముఖ్య ఉద్దేశమన్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను శుభ్రపరిచి, అర్హులకు సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.విఠల్, ఎస్ఎమ్.లయీఖ్, స్వరూపా రాణి, రాంప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, అనిల్ పార్లమెంట్ నాయకులు ప్రమీల, తడక వినోద్, శ్యామ్ సుందర్, ఓ.వెంకటేష్ చౌదరి, పరుశు రామ్, కరణం కిరణ్, భాను ప్రకాష్, బాలాజీ గోస్వామి, పి.వంశీ కృష్ణ, ఎస్.ప్రకాష్ వివిధ నియోజకవర్గాల నాయకులు తాలూకా అనిల్, చంద్రమోహన్ గౌడ్, సత్యనారాయణ, మహేందర్, ఎండి.సలీమ్, బాలకృష్ణ, శక్తి ప్రేమ్, యాదగిరి, బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply