హైదరాబాద్, జూన్ 7, అద్దం న్యూస్ : దేశంలో విద్యారంగంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని, నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులపై నరేంద్ర మోడీ ఫీజుల దాడి చేస్తున్నారని జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను, మయుక్ బిస్వాస్ లు అన్నారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సమావేశాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వీపీ సాను మయుక్ బిస్వాస్ మాట్లాడుతూ… దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలో విద్యారంగంలో మతోన్మాదాన్ని జపిస్తూ నూతన విద్యా విధానం – 2020 పేరుతో విద్యలో మతం పేరుతో సిలబస్ పెడుతున్నారన్నారు. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయుల చరిత్రలను తొలగిస్తున్న పరిస్థితి ఉందని, బిజెపి మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. యూనివర్సిటీలలో విద్యలో మత విద్వేషాలు సృష్టించే విధంగా తనకు అనుగుణంగా ఉన్న వైస్ ఛాన్స్ లను పెడుతున్నారని, అదే విధంగా నూతన విద్యా విధానం పేరుతో దేశంలో విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిపారు. అదే విధంగా సిబిఎస్‌సి, సెంట్రల్ యూనివర్సిటీలలో ఫీజులు అధికంగా పెంచుతున్నారని, దీనివల్ల బడుగు బలహీన వర్గ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యలో పోటీ పడే స్థాయిలో దేశంలో విద్యా వ్యవస్థ ఉండాలి కానీ విద్యార్థుల మధ్య వైశ్యమ్యాలు సృష్టించే విధంగా విద్యా విధానాలను బిజెపి ప్రభుత్వం క్రియేట్ చేస్తుందని విమర్శించారు. ఈ నెల 27 ,28 ,29, 30 .తేదీలలో ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభలు కోజికోడ్ జరుగనున్నాయని, ఈ మహాసభల్లో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు డిప్సీత దార్, నితీష్ నారాయణ, దినిత్ డేంట, అశోక్, జాతీయ సహకార దర్శి ఆదర్శ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రజనీకాంత్. టి.నాగరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply