మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దాం
– రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 08, అద్దం న్యూస్ : మరో గ్రంథాలయ ఉద్యమానికి మార్గం వేద్దామని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, మరింత విస్తరించడం కోసం పుస్తకాలను మరింత చదవడం పెంచడం కోసం ప్రజల్లో అక్షరాస్యతను మరింత విస్తరించడం కోసం పుస్తకాలను చదివే అలవాటును పెంచడం కోసం పుస్తక ప్రియులు, రచయితలు, పుస్తక ప్రేమికులు, గ్రంథాలయ ఉద్యోగులు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరి వరకు “పుస్తకాలతో నడక- వాక్ విత్ బుక్స్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ హాజరై పుస్తక నడక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ అక్షరం ఒంటరిగా ఉన్న మనిషికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని, ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న మనిషి నూతన నాగరికత దిశకు నడిపిస్తాడని ఆ క్రమంలోనే అక్షరాస్యతలను బాగా పెంచాలని పుస్తకాలు బాగా చదివే అలవాటును పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాల ఉద్యమం ఫలితంగానే ఏర్పడిందని ఈ ప్రాంతంలో ప్రజాపాలన స్థాపన, నియంతృత్వ పాలన అంతానికి గ్రంథాలయ ఉద్యమాన్ని దారి చూపాయని కొనియాడారు.
అదే విధంగా రాష్ట్రంలో గ్రంథాలయ అభివృద్ధి కోసం విస్తరణ కోసం పుస్తకాలను, చదువరులకు మరింత చేరువ చేయడం కోసం గ్రంథాలయ సంస్థ అనేక కార్యక్రమాలను చేపట్టబోతుందని వివరించారు. పుస్తకాలను చదవడం.. పుస్తకాలను చదివించడం సెల్ ఫోన్‌లో కన్నా పుస్తకాలతో ఎక్కువ గడపాలని వివరించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు చదువు పట్ల నిబద్ధత నేర్పించి రోజు వారి కార్యక్రమంలో గ్రంథాలయాలకు ఓ గంటసేపు కేటాయించాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి యువతను మిగతా చెడు అలవాట్లకు నుండి దూరం చేస్తుందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువత మరింత విస్తరంగా వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు నర్సింగరావు, ప్రముఖ రచయిత వేణుగోపాల్, యాకూబ్, అయాచితం శ్రీధర్, ప్రభాకర్, విజయలక్ష్మి, రవికుమార్, గ్రంథాలయ సిబ్బంది, అధికారులు, పబ్లిషర్స్, రచయితలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply